Thursday, September 19, 2024

దూసుకొస్తున్న సౌర తుపాన్

- Advertisement -
- Advertisement -

Solar storm expected to hit earth

లండన్: మీ జేబుల్లోని సెల్‌ఫోన్లు, మీకు దిక్కులు తెలిపి దిశానిర్ధేశనం చేసే జిపిఎస్ సిస్టమ్‌లు జాగ్రత్త…అత్యంత శక్తివంతమైన సౌర తుపాన్ భూమివైపు వేగంగా దూసుకొస్తోంది. సూర్యుడి వాతావరణంలో తలెత్తిన పరిణామాలతో ఈ యుగానికోసారి సౌర తుపాన్ తలెత్తింది. భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం పడే ప్రాంతాలు, దీని పరిధిలోని అన్ని రకాల సాంకేతిక వ్యవస్థలను ఈ సౌర తుపాన్ తనదైన రీతిలో ప్రభావం చేయనుంది. ఈ విషయాన్ని అంతరిక్ష వాతావరణ మార్పులపై విశ్లేషణల్లో ఉన్న స్పేస్‌వెదర్. కామ్ తెలియచేసింది. సాధారణంగా భూమికి సౌర తుపాన్‌ల తాకిడి తక్కువే. వేలు కోట్ల సంవత్సరాలలో అత్యంత అరుదుగా ఇటువంటి పరిణామాలు తలెత్తుతాయి. అయితే ఇప్పటివరకూ సౌర తుపాన్ల ప్రభావం, వీటి ఆవిర్భావం వంటి అంశాలపై పెద్దగా చరిత్ర తెలిసిరాలేదు.

బడే వేగంగా దూకుడు

ఈ సౌర తుపాన్ భూమివైపు గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. ఇది ఆదిసోమ వారాలలోనే భూమిని తాకే ముప్పు ఉందని వెబ్‌సైట్ తెలిపింది. అయితే భూమిపై దీని తాకిడి ఎక్కడనేది తెలియచేయలేదు. అయస్కాంత క్షేత్ర ప్రభావిత ప్రాంతాలను దెబ్బతీసే సౌర తుపాన్ తాకిడితో సెల్‌ఫోన్ల నెట్‌వర్క్‌కు, జిపిఎస్ సిస్టంకు భారీగా ముప్పు వాటిల్లనుంది.

Solar storm expected to hit earthఆకాశంలో అత్యద్భుత కాంతిపుంజం

సౌర తుపాన్ భయానక ఫలితం సంగతి ఏ విధంగా ఉన్నా, ఈ తుపాన్ భూగోళానికి కొన్ని సుందర రమణీయ దృశ్యాలను అందిస్తుంది. అసలే అరుణారుణ వర్ణభరిత సూరీడు. చుట్టూ భగభగమండే కాంతిపుంజం. దీని ద్వారా వెలువడే సౌర తుపాన్ కారణంగా భూ ఉత్తర లేదా దక్షిణ ధృవాల మధ్య నింగిలో అత్యద్భుతమైన కాంతిపుంజాలు వెల్లివిరుస్తాయి. ఈ ధృవాలకు సమీపంలోని వారు రాత్రివేళలో ఈ సౌరతుపాన్ సృష్టించే అత్యంత శక్తివంతమైన కాంతి వలయాలు లేదా చాపాలను తిలకించవచ్చు.

ఉపగ్రహ సంకేతాలకు బ్రేక్‌లు

అత్యంత వేగపు సౌర తుపాన్ తాకిడితో ఇప్పటివరకూ నిర్ధేశిత కక్షలలో పరిభ్రమించే పలు శాటిలైట్ల నుంచి వెలువడే సంకేతాలకు, అవి పంపించే డాటాకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది.గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ తుపాన్ వేగం మరింతగా ఇనుమడించే అవకాశాలు ఉన్నాయని నాసా విశ్లేషించింది.

భూమిపై ఎటువంటి ఎఫెక్ట్‌లు.. టీవీ ఛానల్స్ ప్రసారాలకు బ్రేక్?

సౌర తుపాన్ ప్రభావంతో భూ బాహ్య వాతావరణం ఆద్యంతం వేడెక్కుతుంది. దీని కారణంగా శాటిలైట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. జిపిఎస్ నావిగేషన్, శాటిలైట్ టీవీ ప్రసారాలకు నేరు ప్రభావం ఉండవచ్చు. లేదా వీటి పనితీరు ప్రభావితం కావచ్చు. పవర్ లైన్స్‌లోని విద్యుత్ అత్యధికం అయ్యి, హై ఓల్టేజ్‌కు దారితీసి, ట్రాన్స్‌ఫాంలు పేలే వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News