Thursday, January 23, 2025

భూమికి సౌర తుపాను తాకిడి

- Advertisement -
- Advertisement -

ఏమాత్రం జాలిలేని సూర్యుడు ఎప్పుడుపడితే అప్పుడు సౌరజ్వాల విస్ఫోటనాలు వ్యాపింప చేస్తుంటాడు. ఈనెల 4 నుంచి 5 వరకు అత్యంత శక్తివంతమైన సౌరజ్వాలలు వెలువడ్డాయి. సూర్యబింబం పైని ఎఆర్ 3234 స్పాట్ నుంచి ఎక్కువగా సౌర జ్వాలలు లేస్తుంటాయి. వీటి ప్రభావం వల్లనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో రేడియేషన్ ధాటికి రేడియో బ్లాక్‌అవుట్‌లు ఏర్పడ్డాయి.

దీనికి తోడు కరోనల్ మాస్ ఎజెక్షన్ (cme) అంటే కరోనా సామూహిక సౌర జ్వాలలు వెలువడుతున్నాయి. ఫలితంగా భూమిపై సౌర తుఫాను దాడి తప్పదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్పేస్ వెదర్ కామ్ వెబ్‌సైట్ ఇదే విషయాన్ని హెచ్చరించింది. ఈ వారంతంలో సౌరజ్వాలలు కమ్ముకొస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో షార్ట్‌వేవ్ రేడియో బ్లాక్‌అవుట్ సంభవించిందని పేర్కొంది. ఈనెల 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో గంటన్నరకు పైగా రేడియో బ్లాక్ అవుట్ సంభవించింది. అంటే రేడియోలు, కంప్యూటర్లు, వంటి వాటికి సిగ్నల్స్ అందకుండా పోతాయి.

దీనిప్రభావం మెరైనర్లు అంటే నావికులు, డ్రోన్ పైలట్లు , రేడియో ఆపరేటర్లు, దాదాపు గంటన్నర సేపు ఎలాంటి సిగ్నల్స్ అందక సతమతమయ్యారు. అయితే ఈ సౌర జ్వాలలు ఎం తరగతి స్థాయివి అంటే తక్కువ స్థాయి కలిగినవైనందున అదృష్టవశాత్తు జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్‌సిస్టమ్ ) అంటే భూమిపై , గాలిలో, నీటిపై నావిగేట్ చేయడానికి సహాయపడే ఉపగ్రహ వ్యవస్థ , ఇతర వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు సిఎంఇ (కరోనా మాస్ ఎజెక్షన్) శక్తివంతమైన దాడికి భూమి సిద్ధంగా ఉండవలసి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సౌర తుపాన్ జి1 తరగతి స్థాయి అయినందున స్వల్పమైన సంఘటనలే జరుగుతాయని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News