Thursday, December 26, 2024

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి సోలార్ ట్రీ

- Advertisement -
- Advertisement -

Solar Tree entered the Guinness Book of Records

హైదరాబాద్: ప్రంపంచంలో అతి పెద్ద సో లార్ ట్రీని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిందని సిఎస్‌ఐఆర్, సీఎంఆర్‌ఐ డైరక్టర్, ప్రొఫెసర్ హరీష్ హిరానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోలార్‌ని పంజాబ్‌లోని లుధియానాలో అభివృద్ధి చేశామని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో సైతం పేరు నమోదైనట్లు తెలిపారు. సోలార్ పీవీ ప్యానల్ సర్పేస్ ఏరియా 309.93 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఉన్న 67 చదరపు మీటర్ల రికార్డును బేక్ చేసినట్లు తెలిపారు. ఈ సోలార్ ట్రీ ఇన్‌స్టాల్ సామర్థం 53.6 కిలో వాట్స్ పీక్‌గా ఉండటంతో పాటు రోజుకు 160 నుంచి 200 యూనిట్ల వి ద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సోలార్ ట్రీ ద్వా రా ఈ ట్రాక్టర్ల చార్జింగ్, ఈ పవర్ టిల్సర్స్‌కు చార్జింగ్‌తో పాటు సాగు నీటి అవసరాలకు వినియోగించే వ్యసాయ పంపు సెట్లకు కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News