Sunday, December 22, 2024

లంగర్‌హౌస్‌లో సైనికుడి ప్రాణం తీసిన మాంజా దారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ లో సంక్రాంతి పండగ వేళ వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరి గాలిపటల సరదా జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ఆదివారం గాలిపటాలు మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. అల్వాల్‌లో గాలిపటం ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు. అటు లంగర్‌హౌజ్‌లో చైనా మాంజా మెడకు చుట్టుకుని సైనికుడు మృతిచెందాడు.

లంగర్ హౌస్ పైవంతెన వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుంది. విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సైన్యంలో పనిచేస్తున్న జవాన్ విశాఖకు కోటేశ్వరరావుగా గుర్తించారు. గాలిపటాలు ఎగరేస్తూ రెండ్రోజుల్లో పలువురు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News