Sunday, September 8, 2024

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడి వీరమరణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కమ్‌కారీ సెక్టార్‌లో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి) శనివారం జరిపిన దాడిని భారత ఆర్మీ భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు వీరమరణం పొందగా, కెప్టెన్‌తో సహా మరో నలుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ చొరబాటుదారుడు కూడా మృతి చెందినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు పాక్ చొరబాటుదారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) లోకి పారిపోయారు. నాలుగు గంటల సేపు హోరాహోరీగా ఎన్‌కౌంటర్‌లో కాల్పులు జరిగాయి.

ఉత్తరకశ్మీర్ జిల్లా ట్రెహ్గామ్ సెక్టార్‌లో కుంకడి పోస్ట్ సమీపాన మొదట ముగ్గురు చొరబాటుదారులు గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారని , వీటిని భారత ఆర్మీ దళాలు తిప్పి కొట్టాయని తరువాత ఇరు పక్షాల మధ్య ఎన్‌కౌంటర్ సాగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత జవాన్లు ఐదుగురు తీవ్రంగా గాయపడగా, ఒకరు వీరమరణం పొందారని, పేర్కొన్నాయి. గాయపడిన కెప్టెన్‌తో సహా మొత్తం నలుగురిని బేస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News