ముంబయి: జవాన్ తన ప్రియురాలని చంపి అనంతరం మృతదేహానికి సిమెంట్ పూసి పూడ్చిపెట్టాడు. అనంతరం అతడు పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన సంఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌లోని కైలాశ్ నగర్‌కు చెందిన అజయ్ వాంఖేడ్ అనే వ్యక్తి భారత సైన్యంలో జవాన్‌గా పని చేస్తున్నాడు. జోత్స ఆక్రే అనే మహిళ విడాకులు తీసుకొని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మ్యారేజ్ పోర్టల్ అనే వైబ్‌సైట్ ద్వారా జోత్యకు అజయ్ పరిచయమయ్యాడు.
పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అజయ్ తన ప్రేమ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తిరస్కరించారు. దీంతో అజయ్ ఆమెను దూరంగా పెట్టడం ప్రారంభించాడు. ఆమె ఫోన్ కాల్ లిప్ట్ చేయకపోవడంతో బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో అజయ్ స్నేహితుల ద్వారా అతడి ఆచూకీ తెలుసుకుంది. అజయ్ తన తల్లి ఫోన్‌తో ఆమె ఫోన్ చేసి వార్దా రోడ్డుకు రమ్మని కబురు పంపాడు. ఆగస్టు 28న ఆక్రే తన కుటుంబ సభ్యులకు బయటకు వెళ్తున్నానని చెప్పింది. వార్ధా రోడ్డుకు వెళ్లిన తరువాత ఆమెను అతడు హోటల్ రూమ్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి టోల్ ప్లాజా వద్దకు తీసుకెళ్లి మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఆమెతో తాగించాడు. ఆమె స్పృహ తప్పిపడిపోయిన తరువాత గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహానికి సిమెంట్ పూసి నిర్మానుష్య ప్రదేశంలో గుంత తొవ్వి పాతి పెట్టాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలో పడేశాడు.
అగస్టు 29 వరకు ఆమె కనిపించక పోవడంతో ఆక్రే తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా వాంఖేడ్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని కోర్టు ద్వారా అతడికి నోటీసులు పంపారు. అప్పటికే బిపి ఎక్కువగా ఉండడంతో అతడు పుణేలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారణలో హత్య జరిగిన స్థలంలో అతడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గుంతలో మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు అజయ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.