Tuesday, November 5, 2024

ఆమె సైనికాధికారి అయ్యింది!

- Advertisement -
- Advertisement -

Jyoti Nainwal
చెన్నై: నాయక్ దీపక్ నైన్‌వాల్ అనే సైనికుడు 2018లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడి కన్నుమూశాడు. కానీ తన భర్త స్మృతులను మనస్సులో పెట్టుకుని ఆయన భార్య జ్యోతి నైన్‌వాల్(33) మూడేళ్ల తర్వాత  సైనికాధికారి అయ్యింది. శనివారం ఆమె 28 మహిళా కెడెట్స్ పాసింగ్ అవుట్ పెరేడ్‌లో తన శిక్షణ ముగించుకుంది. ఆ తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలకు సైనిక యూనిఫారమ్ వేయించి, ఎత్తుకుని తన భర్తను జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ఆ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. నాయక్ దీపక్ నైన్‌వాల్ తొమ్మిదేళ్ల కూతురు లావణ్య “నేను దీపక్ నైన్‌వాల్ కూతురునైనందుకు గర్విస్తున్నాను”అని చెప్పింది. తన సోదరుడు రేయాంశ్‌తో కలిసి గ్యాలరీలో కూర్చున్న లావన్య తన తల్లికి చేయి ఊపుతూ ఆనందం కూడా వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా జ్యోతి నైన్‌వాల్ ఇప్పుడు లెఫ్టినెంట్ అయ్యింది. తన కుటుంబం నుంచి సైన్యంలో చేరిన తొలి మహిళ ఆమె. “నా భర్త తాలూకు మహర్ రెజిమెంట్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా బాధ, కష్టకాలంలో వారు నాకు అండగా నిలిచారు. నేనిప్పుడు ఏమైనా సాధించానంటే ఆ రెజిమెంటే కారణం” అన్నారు. జ్యోతి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె చెన్నై అకాడమీ నుంచి 11 నెలల శిక్షణ పూర్తిచేశారు. మొత్తం 153 మంది కెడెట్స్ శనివారం తమ శిక్షణను ముగించారు. వారిలో 16 మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, మల్దీవులకు చెందిన వారు కూడా ఉన్నారు. కాగా ఆర్మీ స్టాఫ్ వైస్-ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సిపి మోహన్తీ మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాలుగా సైన్యంలో మహిళలు కూడా గణనీయ పాత్రను పోషిస్తున్నారు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News