Friday, December 27, 2024

మంత్రి కెటిఆర్‌కు మరో ఘన ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మే 1 నుంచి 4వరకు
లాస్‌ఏంజిల్స్‌లో జరిగే
సెలెబ్రేటింగ్ ది పవర్ ఆఫ్
కనెక్షన్ సదస్సులో
పాల్గొనాలని మిల్కెన్
ఇన్‌స్టిట్యూట్ నుంచి పిలుపు

Minister KTR's visit to America ended

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐ టి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందిం ది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సు ల్లో పాల్గొనే అరుదైన అవకాశాలను దక్కిం చుకున్న తాజాగా అమెరికాకు చెందిన మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ తమ 25వ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ప్రసం గించాల్సిందిగా ఆహ్వానించింది. లాస్ ఏంజిల్స్‌లో మే1 నుంచి 4వ తేదీ వరకు సెలబ్రేటింగ్ ది పవర్ ఆఫ్ కనెక్షన్ పేరు తో జరగనున్న సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిందిగా  మంత్రి కెటిఆర్‌ను కోరింది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ, ఆర్థిక, వైద్య రంగాల ప్రముఖులు, వ్యాపార వేత్తలు, నిపుణులు హాజరు కానున్నారు. కాగా తనకు ఆహ్వానం అందడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించిన మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ సంస్థకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News