Monday, December 23, 2024

గుజరాత్ లో తనను తానే పెళ్ళి చేసుకున్న క్షమా బిందు

- Advertisement -
- Advertisement -
Self Marriage
క్షమా బిందు అనే 24 ఏళ్ల యువతి బుధవారం తనను తాను వివాహం చేసుకుంది. గుజరాత్‌లో ఇది బహుశా మొదటి స్వీయ వివాహం లేదా సోలోగామి.

గోత్రి(గుజరాత్): క్షమా బిందు అనే 24 ఏళ్ల యువతి బుధవారం తనను తాను వివాహం చేసుకుంది. గుజరాత్‌లో ఇది బహుశా మొదటి స్వీయ వివాహం లేదా సోలోగామి.క్షమా బిందు వివాహ బంధంలోకి ప్రవేశించింది, ఈ వేడుకలో ప్రదక్షిణలు సహా సాధారణ వివాహ వేడుకకు సంబంధించిన అన్ని అంశాలు నిర్వహించింది.

క్షమా జూన్ 11న వివాహం చేసుకోవలసి ఉండింది, అయితే ఆమె స్వీయ-వివాహం నిర్ణయం అకస్మాత్తుగా సమాజం అంతటా ఒక సంచలనం మారిన తర్వాత , వివాదాలను నివారించడానికి ఆమె వివాహాన్ని అనుకున్న తేదీ కన్నా ముందస్తుగానే నిర్ణయించుకుని స్వీయ వివాహం చేసుకుంది.

గోత్రి ప్రాంతంలోని ఆమె ఇంటిలో ఏర్పాటు చేసిన 40 నిమిషాల వివాహ డిజిటలైజ్డ్ ఆచారాలలో, క్షమా స్నేహితులు ఆమెకు జీవితాంతం ఆదుకుంటామని వాగ్దానం చేస్తూ పూల వర్షం కురిపించారు.

వధువు తన ‘మెహందీ’ , ‘హల్దీ’ ఆచారాలను కూడా ఆచరించింది, అయితే, తన ఇంటికి సందర్శకులు నిరంతరం రావడంపై కొంతమంది ఇరుగుపొరుగువారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆమె పెళ్లికి పెళ్ళి కొడుకు లేడు, పెళ్లి పురోహితుడు లేడు. పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు కూడా లేరు. ఓ బిజెపి మహిళా నేత ఈ స్వీయ వివాహాన్ని వ్యతిరేకించడంతో…పెద్ద ఆర్భాటం లేకుండా సింపుల్ గా చేసుకుంది. మంగళసూత్రాన్ని కూడా స్వయంగా కట్టుకుంది. ఇక ఫోటోలు వీడియోలు మీరే చూడండి.

self marriage2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News