Saturday, November 23, 2024

దశాబ్దాల సమస్యలకు మిషన్ భగీరథతో పరిష్కారం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

మంచాల:మిషన్ భగీరథతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో ఆదివారం మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఘనంగా మంచినీళ్ల పండుగ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హజరై ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి మంచినీటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు మిసన్ భగీరథ పథకం తో మంచినీటి సరఫరా చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

మంచాల గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపిపి జాటోత్ నర్మద, ఎంపిడివో శ్రీనివాస్, తహసీల్ధార్ అనిత, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, పిఎసిఎస్ చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, సర్పంచ్‌లు అనిరెడ్డి జగన్‌రెడ్డి, రాజు నాయక్, ఎంపిటీసీ సుకన్య, మిసన్ భగీరథ అధికారులు అనిరుద్, స్రవంతి, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, పల్లె జంగారెడ్డి, చిందం రఘుపతి, అమరేందర్ రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులు వనపర్తి బద్రినాధ్ గుప్తా, గంట విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీపాషా, జంబుల కిషన్ రెడ్డి, అశ్వాల బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News