Wednesday, January 22, 2025

మా సమస్యలు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -

చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నాం
ఓవర్‌లోడ్‌తో బస్సులు దెబ్బతింటున్నాయి
ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం
అందచేసిన అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్ : మా సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. చాలా కాలంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పొన్నంకు అద్దె బస్సుల యజమానులు వివరించారు. ఆర్టీసి అద్దె బస్సుల సంఘం నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిందని వారు మంత్రితో తెలిపారు. ఆర్టీసిలో మొత్తం 2,700 అద్దె బస్సులు రాష్ట్రమంతా నడుపుతున్నామని వారు మంత్రితో అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నేటి నుంచి 2,700 బస్సులను రోడ్డు ఎక్కించేది లేదని యజమానులు హెచ్చరించారు.

నాలుగు సంవత్సరాల నుంచి బస్సులకు సరైన మైలేజ్ రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం గంటకు తిరగాల్సింది కూడా తిరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పివిజీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.4.50లు, సిటీ బస్సులకు రూ.4లుగా మార్పులు చేయాలని వారు కోరారు. ప్రస్తుతం ఆర్టీసి అద్దె బస్సుల ఇన్సూరెన్స్ కెపాసిటీ పల్లె వెలుగు బస్సులకు 56మంది, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 51గా ఉందని వారు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసి ప్రయాణాలు బాగా పెరిగాయని, దీంతో 100 నుంచి 120 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణించడం వల్ల ఓవర్ లోడ్ అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని దానిని యాజమాన్యమే చూసుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఓవర్‌లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని వారు వివరించారు. ప్లోర్ రేట్ కిలోమీటర్‌కు రూ.3లు అదనంగా పెంచాలని వారు కోరారు. అద్దె బస్సుల డ్రైవర్లపై పని ఒత్తిడి పెరిగిపోయిందని ఆ దిశగా ఆలోచన చేయాలని వారు సూచించారు. వారి ఆవేదనను విన్న పొన్నం సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అద్దె బస్సుల యజమానులతో స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News