Friday, November 22, 2024

మా సమస్యలను పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -
మోడీకి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్ధూర్ యూనియన్ నాయకుల వినతి

హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల, కార్మికుల సమస్యలను ప్రధాని మోడీ ఇప్పటికైనా పరిష్కరించాలని, నేడు వరంగల్ వస్తున్న ప్రధానికి ఉద్యోగులు, కార్మికులకు, దక్షిణమధ్య రైల్వేకు వరాలజల్లు కురిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్ధూర్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ప్రధాని రాకను పురస్కరించుకొని శంకరరావు చోడవరపు, ప్రధాన కార్యదర్శి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్, కోశాధికారి ఏఐఆర్‌ఎఫ్, న్యూఢిల్లీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంశాలు ఇలా….
1. పెద్ద సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించే కాజీపేట వద్ద హెచ్‌క్యూఆర్‌ఎస్‌తో కొత్త రైల్వే డివిజన్ మంజూరు చేయాలి.
2. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల ప్రయోజనం కోసం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి.
3.రైల్వే,సెంట్రల్ గవర్నమెంట్‌లో స్థానికుల ద్వారా మాత్రమే గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.
4. భద్రాచలం నుంచి కొవ్వూరుకు లైన్‌ను త్వరగా పూర్తిచేయాలి.
5. సికింద్రాబాద్‌లోని ఆర్‌వై మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించాలి
6., హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ రైల్వే హాస్పిటల్ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు 30 శాతం పడకలతో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఇతర ఇన్‌పేషంట్ల కోసం వినియోగించాలి.
రైల్వే ఉద్యోగుల సమస్యలు….
1. NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) రద్దు చేసి పెన్షన్ స్కీమ్ (OPS)ను పునరుద్ధరించాలి.
2. రన్నింగ్ స్టాఫ్, ట్రాక్‌మెన్, పాయింట్‌మెన్, అన్ని సేఫ్టీ కేటగిరీ సిబ్బందికి జిపి 6600 వరకు గ్రూప్ సి గ్రేడ్లను మంజూరు చేయాలి.
3.స్థానిక అభ్యర్థుల ద్వారా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి.
4. ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కేటగిరీ మార్పును అనుమతించాలి.
5. రైల్వేలో రిక్రూట్ చేయబడిన, శిక్షణ పొందిన అప్రెంటీస్‌లను రైల్వేలు నిర్ణీత ప్రక్రియ తర్వాత స్వయంచాలకంగా గ్రహించేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయాలి.
5 కేంద్ర ప్రభుత్వంలో మహిళలకు 30 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి.
6.రైల్వేలు, రక్షణ పౌర ఉద్యోగుల్లో అన్ని ఓపెన్ లైన్ సిబ్బందికి రిస్క్, హార్డ్ డ్యూటీ అలవెన్స్‌ను పెంచాలి.
7. మూసివేసిన అన్ని రైల్వే పాఠశాలలను తిరిగి తెరవడం, రైల్వే ఉద్యోగులకు కాకుండా ఇతరులకు 30 శాతం సీట్లు, కార్పొరేట్ సౌకర్యాలతో హాస్టల్‌ను కేటాయించాలి.
8. రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం గృహాల నిర్మాణాన్ని చేపట్టాలి.
9.వడ్డీ లేని రుణాలను సక్రమంగా మంజూరు చేయాలి.
10. ఉద్యోగి పిల్లలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యా భత్యం మంజూరు చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News