Monday, January 20, 2025

సొంత నిధులతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తా

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట: గ్రామాలలోని సమస్యలను తన సొంత నిధులతో పరిష్కరిస్తానని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతల పల్లి మండలం అద్రాస్ పల్లి,ఉద్దేమర్రి, కేశవపూర్, అనంతరం గ్రామాలలో పాదయాత్ర చేస్తూ సమస్యలను గుర్తించారు.

కేశవపూర్ గ్రామంలో రూ.1కోటి సీసీ, బిటి రోడ్లను ప్రారంభించాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు చింతలపల్లి మండలంలోని ఐదు గ్రామాలలో దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి పరిచారన్నారు. మిగతా గ్రామాలలోని సమస్యలను స్వంత నిధులతో సీసీ రోడ్లు, గుడులు,సంఘల భవనాలు, నిర్మిస్తానని తెలిపారు.

ఉద్దేమర్రి గ్రామంలో పర్యటిస్తుండగా దళితవాడలోని మహిళలు రోడ్డు సమస్య ఉందని, మురికి కాలువ సమస్య ఉందని ఎవరు పట్టించుకోవడంలేదని మంత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నావని మంత్రికి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు.

దళిత బంద్ కోసం అర్హులను గుర్తించాలని ఆయా గ్రామాల సర్పంచులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమలలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,స్థానిక సర్పంచ్ లు ఇస్తారి, అనురాధ రవీందర్‌రెడ్డి, లలిత, నరసింహ రెడ్డి, నాయకులు మురళి గౌడ్, హరిమోహన్‌రెడ్డి, మల్లేష్ గౌడ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News