Wednesday, January 22, 2025

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -
మంత్రి ఎర్రబెల్లికి సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 50 వేలమంది సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దయాకర్‌రావును కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించి.. పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేయాలని కోరారు. పంచాయితీ సిబ్బంది పారిశుధ్య కార్మికులుగా, ఎలక్ట్రీషియన్‌లుగా పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితీ సిబ్బందికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రతి నెల సరైన వేతనాలు ఇవ్వాలని వారి ఎనిమిది డిమాండ్లను వివరిస్తూ వినతి పత్రం మంత్రికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News