Monday, December 23, 2024

ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సిలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్‌లతో కలసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి విజ్ఙాపనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరితగతిన ప్రజలు అందించిన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో స్వచ్ఛత పారామీటర్స్‌ను ప్రత్యేకాధికారులు పరిశీలించలన్నారు. పారిశుధ్యం, మన ఊరు మనబడి పనుల పురోగతిని పర్యవేక్షించాలని, ఎన్‌అర్‌జీఎస్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పేర్కోన్నారు. సీజనల్ వాతావరణ మార్పులకు సంబంధించిన చర్యలు మున్సిపల్, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ వారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు.

విద్యాశాఖ అధికారులు సంక్షేమ హాస్టల్స్, స్కూల్స్‌లలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపర్చేందుకు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పోడు భూముల పట్టాలు లబ్ధ్దిదారులకు పంపిణీని సమర్ధవంతంగా నిర్వహించినందుకు, జిల్లాలో 14,205 అభ్యర్థులు పాల్గొన్న గ్రూప్. 4 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను జిల్లా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలపారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ సన్యాసయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, మున్సిపల్ కమీషనర్ కె. ప్రసన్నరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News