Friday, December 20, 2024

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి : ఎబివిపి

- Advertisement -
- Advertisement -

కదనభేరి సభలో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఎబివిపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి కదన భేరి సభ కు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విద్యార్థుల సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఎబివిపి నిద్రపోదని హెచ్చరించారు. నాడు ఆంధ్రప్రదేశ్ నాయకుల పాలన అంతం కావాలని ఉస్మానియా యూనివర్శిటీలో రణభేరి మోగించామని, ఈనాడు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బిఆర్‌ఎస్ పరిపాలన అంతం కావాలని కదనభేరి మోగిస్తున్నామన్నారు.

తొమ్మిదేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు రోడ్డున పడ్డాయన్నారు. 8 వేల పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ లీకేజీ సర్వ సాధారణమంటూ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబివిపి అఖిల భారతీయ సంఘటన మంత్రి ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ గడచిన పదేళ్లలో గూగుల్ కంపెనీ హైదరాబాద్ రావాలనుకున్నది.. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్లిపోయారని వెల్లడించారు. స్టార్ట్ అప్ కంపెనీల అభివృద్ధిలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. తొమ్మిదేళ్లగా యువత, విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ కార్యదర్శి అంకిత పవార్ ,అఖిల భారతీయ సహా సంఘటన మంత్రి బాలకృష్ణ . జాతీయ కార్యదర్శి యజ్ఞవల్క శుక్ల మాట్లాడుతూ కెసిఆర్ హఠావో తెలంగాణ బచావో అని నినదించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్ రెడ్డి, సిడబ్ల్యూసి శ్రవణ్ రాజ్ , నగర కార్యదర్శి శ్రీకాంత్ , శ్రీహరి పగిడిపల్లి , శ్రీనాథ్ , పృధ్వీ, సురేష్, రాంబాబు, సతీష్, మనోజ్ , రాష్ట్ర కమిటీ సభ్యులు జీవన్, రంజత్, నరేష్, తేజా, శివ, సంతోష్ , రాష్ట్ర కార్యదర్శులు సిరివెన్నెల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Kadana Bheri

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News