Wednesday, January 22, 2025

విద్యా రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లా కలెక్టర్లను ముట్టడి చేపట్టి ఈసంఘం అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి, కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ గురునానక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పోరాడున్న నాయకత్వంపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అనుమతులు లేకుండా విద్యార్థులు చేర్చుకోని లక్షలు రూపాయాలు వసూళ్లు చేసిన గురునానక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించాలని, బడుల్లో మౌలిక వసతులు, టీచర్ల నియామకం వెంటనే చేపట్టాలని కోరారు.

ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, ఉర్ధూ మీడీయం,ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఆయా మీడియం పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ కళాశాలలో,కెజిబివిలు, గురుకులాలు ఒక్కపుస్తకం ముద్రించి కళాశాలలకు పంపలేదని, దీంతో పాఠ్యపుస్తకాలు లేకుండా పేదల విద్యార్థులు చదువులు కొనసాగించలేరని పేర్కొన్నారు. 24 వేల టీచర్ పోస్టులు, 12వేల లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయాలన్నారు. గురుకులాలు, వసతి గృహాలకు నిధులు లేకపోవడంతో నాణ్యమైన భోజనం ,త్రాగునీరు, మరుగుదొడ్లు సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పుడ్ ఫాయిజన్ అవుతున్న అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చల విడిగా లక్షలాది రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని ఆరోపించారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు ఫీజుల రెగ్యూలేషన్ ఉన్న, పాఠశాల, ఇంటర్ కళాశాల ఫీజుల నియంత్రణ లేదని, ఈవిద్యా సంవత్సరంలో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

వర్శీటీలకు నిధులు లేకపోవడంతో రెగ్యూలర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి ఫీజులు వసూళ్లు చేయడం సరికాదన్నారు. తెలంగాణ యూనివర్శీటీలలో పాలనంతా అస్థవ్యస్థంగా మారి అవీనీతికి నిలయంగా మారిందన్నారు. ఈసందర్భంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ పేరుతో లక్షల వ్యాపారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు కౌన్సెలింగ్ పూర్తికాకుండానే లక్షల డోనేషన్లు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్రకమిటి సభ్యురాలు మమత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, రమ్య, ప్రశాంత్, స్టాలిన్, శ్రీమాన్,సునీల్, సాయి, జిల్లా నాయకులు కవిత, వేమన,సాయి, శ్రీరామ్, అజయ్, చత్రపతి ,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News