Thursday, January 23, 2025

బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించండి : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నికలప్పుడే కులాలు, మతాలు, ఆత్మగౌరవ భవనాలు బిఆర్‌ఎస్ పార్టీకి గుర్తుకొస్తాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ’పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల’ సమయంలో తప్ప, అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ ఆయనకు కనీసం నివాళి కూడా అర్పించలేదన్నారు.

’బ్రాహ్మణ సదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు, తెలంగాణలోని బ్రాహ్మణులను కాదని పక్క రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులను తీసుకురావలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిజంగా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News