Thursday, January 23, 2025

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -
మంత్రి తుమ్మలకు పెన్షనర్ల వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆదరాబిమానాలు చూరగొని రాష్ట్ర మంత్రిత్వ బాధ్యతలు చేపట్టినందుకు తుమ్మలను అభినందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఖమ్మం జిల్లా పెన్షనర్లతో కలిసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా జి. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ బడీ చౌడీలోని తమ సంఘం నిరంతరం పెన్షనర్ల సమస్యలపై పోరాడుతోందని, ఈ క్రమంలో తమరిని కలిసినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. పెన్షనర్లకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినందుకు పెన్షనర్లందరి పక్షాన ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్ల ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృస్టికి తెస్తున్నామన్నారు. విశ్రాంత ఉద్యోగులకు వారి మూలపెన్షన్ నుండి 1 శాతం సొమ్ము మినహాయించి పూర్తి స్థాయిలో (ఈహెచ్‌ఎస్ ) వైద్య సదుపాయం కల్పించుటకు మొదటి పిఆర్‌సి సూచించిన విధంగా గత ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం 186 ( తేదీ 08-10-2023) ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిందని, కానీ విధి విధానాలు, ట్రస్ట్ సీఈఓను, సభ్యులను నియమించనందున అమలుకు నోచుకొనలేదన్నారు.

సత్వరమే ఈహెచ్‌ఎస్ ట్రస్ట్ సీఈఓను నియమించి పెన్షనర్లకు వైద్య సౌకర్యం పొందు సౌకర్యం పొందుపరుచుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పెన్షనర్లలో 85 శాతం మంది పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘ ట్రస్ట్‌లో ప్రభుత్వ పరంగా ఇద్దరు ప్రతినిధులను నియమించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డిఆర్ లను విడుదల చేసి ఏక మొత్తంలో బకాయిలను చెల్లించాలని కోరారు. ఇంకా ప్రతి నెలా ఒకటో తేదీననే పెన్షనర్లకు వేతనాలు అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News