Friday, December 20, 2024

వక్ఫ్ బోర్డు భూముల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -
  • వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు కోహీర్ మండల రైతుల వినతి

కోహీర్: మండల కేంద్రమైన కోహీర్‌తోపాటుమండలంలోని ఐదు గ్రామాల్లో సుమారు 6వేల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు ఉండడంతో వాటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసియుల్లాకు కోహీర్ మండల బాధిత రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా గతంలో ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావు, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. 1954 ఖాస్త్రా పహాణిలో పట్టా భూమిగా ఉందని, 1979 /80 ఆర్‌ఓఆర్‌లో పట్టా భూమిగా 1989/90 సంవత్సరంలో ఆర్‌ఓఆర్‌లో పట్టా భూమిగా నమోదై ఉన్నప్పటికీ 2018వ సంవత్సరంలో భూ ప్రక్షాళన కార్యక్రమంలో తమ పట్టా భూములు వక్ఫ్ బోర్డుగా నమోదైనందున పూర్వపు రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.

కోహీర్ రైతుల విజ్ఞప్తిపై స్పందించిన చైర్మన్ మసియుల్లా పూర్వపు రికార్డులను పరిశీలించి కోహీర్ మండలంలో వక్ఫ్ బోర్డు విస్తీర్ణం గురించి అధికారుల ద్వారా తెలుసుకుందామని, అవసరం అ యితే తానే స్వయంగా త్వరలో కోహీర్ మండల కేంద్రానికి విచ్చేసి అధికారులు ద్వారా వివరాలను తెలుసుకొని రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు అల్ల బకాశ్ ఖుర్షిద్, తుమ్మన్‌పల్లి రఫియోద్దీన్, కౌసర్,బస్వరాజ్, దశరథ్ రెడ్డి, పాపిరెడ్డి, అల్లబుక్శ్ ఖాసిం, బిఆర్‌ఎస్ కోహీర్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అహేమద్, కోహీర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఇఫ్తేఖర్ అలీ, కోహీర్ ఎంపిటిసి సవుద్ షాహిద్, హర్షద్, మక్సుద్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News