Tuesday, April 8, 2025

సోమవారం రాశి ఫలాలు(07-04-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – రాబడి పెరుగుతుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శుభవార్తలు వినగలుగుతారు.

వ్యషభం –  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.  గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

మిథునం – స్థిరాస్తుల విలువ పెరుగుతుంది.స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం – నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వృధా ఖర్చులు అధికమవవుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

సింహం – ప్రత్యర్ధులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. దైవ చింతన కలిగి ఉంటారు.

కన్య –  వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతారు.

తుల – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు పోటీ, శ్రమ అధికంగా ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి. కొద్దిపాటి ధన లాభం.

వ్యశ్చికం – వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శన.

ధనుస్సు – దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పుల బాధ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తు లాభం.

మకరం – శ్రమకు తగిన లాభం పొందుతారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు  అవసరం.

కుంభం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది.

మీనం – అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News