Monday, December 23, 2024

రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Some are trying to trouble the Telangana: MLC Kavitha

ధ్వజమెత్తిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకపోతున్న రాష్ట్రానికి ఆదాయం రాకుండా, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అందినవ్వకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం బాలాపూర్ గణనాథని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని గణనాధుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఆ దేవదేవుడి దయవల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, టియస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా టిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడిగా కాసర్ల
టిఆర్‌ఎస్‌నుఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడో సారి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్‌ఆర్‌ఐ కో…ఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రకటించారు. కాగా మరోసారి అధ్యక్షుడిగా నియమితులైన కాసర్లకు ప్రత్యేకంగా కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ వాలీబాల్ ఆటగాడు మహేష్ ఆర్థిక సాయం
ఆస్ట్రేలియా లో జరగనున్న బీచ్ పారావాలీ నేషనల్ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన టిఆర్‌ఎస్ కార్యకర్త, తెలంగాణ ఆటగాడు మహేష్ ను కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని నివాసంలో మహేష్‌కు ఆమె లక్ష రూపాయల అర్థిక సాయం అందించారు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో సెప్టెంబరు 16-20 న జరిగే టోర్నమెంట్ లో మహేష్ పాల్గొననున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News