Monday, December 23, 2024

26న అమెరికాకు టీమిండియా తొలి బృందం

- Advertisement -
- Advertisement -

ముంబై: టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టుకు చెందిన తొలి బృందం మే 26న అమెరికా బయలుదేరి వెళ్లనుంది. ఐపిఎల్ క్వాలిఫయర్ పోటీలు ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు విండీస్‌కు వెళతారు. తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, రింకు సింగ్, బుమ్రా తదితరులు అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. వీరు ఐపిఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో వీరిని ముందుగానే అమెరికా పంపించాలని బిసిసిఐ భావిస్తోంది. తొల బ్యాచ్‌లో ఈ ఆటగాళ్లను పంపించాలని బిసిసిఐ నిర్ణయించింది.

ఇక 26న ఐపిఎల్ ఫైనల్ పోరు జరుగనుంది. ఈ సమరం ముగిసిన తర్వాతి రోజు మిగతా ఆటగాళ్లు అమెరికా వెళుతారు. వెస్టిండీస్,అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ విశ్వకప్‌లో భారత్‌తో సహా 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ ఐదు ఐర్లాండ్‌తో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 9న, 12న అమెరికాతో, 15న కెనడాతో భారత్ తలపడనుంది. కాగా, భారత్ ఆడే మూడు మ్యాచ్‌లకు న్యూయార్క్, ఒక పోటీకి ఫ్లోరిడా ఆతిథ్యం ఇస్తున్నాయి. మరోవైపు మెగా టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మందితో కూడిన జట్టును బిసిసిఐ ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News