Sunday, April 13, 2025

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమి లేదని అన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని తెలియజేశారు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేక పోతున్నాయని చెప్పారు. అధికారం పోతే కొన్ని పార్టీలు సంయమనం కోల్పోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News