Monday, December 23, 2024

తరలింపు విమానాల్లో పెంపుడు జంతువులు తెచ్చుకున్నారు!

- Advertisement -
- Advertisement -

Some students on evacuation planes Pets got it

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను గురువారం ఉదయం హిండన్ విమాన స్థావరం నుంచి తరలించినప్పుడు కొందరు విద్యార్థులు తమ పెంపుడు కుక్కలను, పిల్లులను తెచ్చుకున్నారు. పుణెకు చెందిన యుక్త అనే విద్యార్థిని ఏడు నెలల సైబేరియన్ హస్కీ పప్పీ ‘నీలా’ను తెచ్చుకుంది. కాగా దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి వికె సింగ్ ట్విట్టర్‌లో ‘ప్రయాణికులతో ఆ కుక్కపిల్ల బాగానే మసలుకొందని నమ్ముతున్నాను. నేను తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని(యుక్త, నీలా) చూస్తాను. జాగ్రత్తగా ఉండండి. జై హింద్’ అని రాశారు. ఇదిలావుండగా తన పెంపుడు కుక్కపిల్ల ‘జైరా’ను వదిలి రాలేనని మెడికల్ విద్యార్థిని ఆర్య ఆల్డ్రిన్ కూడా పట్టుపట్టింది. ఆమెను కేరళ వాద్యా శాఖ మంత్రి వి. శివన్ కుట్టి కూడా ఫేస్‌బుక్‌లో మెచ్చుకున్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కొందరు భారతీయ విద్యార్థులు తమ పెంపుడు జంతువులను వదిలి స్వదేశానికి రాలేమని చెప్పారు.ఉక్రెయిన్‌లో దాదాపు 8వేల మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు చిక్కుబడ్డారని విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా మంగళవారం చెప్పారు. భారతీయులను తరలించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్లారు. హంగరీకి హర్దీప్ సింగ్ పూరీ, రొమేనియాకు జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాకు కిరణ్ రిజ్జు, పొలాండ్‌కు
వికె సింగ్ వెళ్ళారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News