Monday, December 23, 2024

మరో రెండు రోజుల పాటు పలు రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం పరిమితంగా రైళ్లను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

షాలిమార్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌కు వెళ్లాల్సిన (12841) రైలును సోమ, మంగళవారాల్లో రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న సంత్రగచి -తాంబరం రైలు (22841)తో పాటు హావ్-డా చెన్నై (12839); ఎర్నాకుళం- హావ్‌డా (22878) రైళ్లను రద్దు చేశారు.

మరికొన్ని రైళ్లు రీషెడ్యూల్
అలాగే, ఈ నెల 6వ తేదీన హావ్‌డా టు సికింద్రాబాద్ (12703), షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (18045), హావ్‌డా ఎస్‌ఎంవిటి బెంగళూరు (22887), సంత్రగచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22807), ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై- హావ్‌డా(12840), విల్లుపురం- ఖరగ్‌పూర్ (2204), హైదరాబాద్ దక్కన్ – షాలిమార్ (18046), షాలిమార్- తిరువనంతపురం (22642), గువాహటి -ఎస్‌ఎంవిటి బెంగళూరు (12510), అగర్తలా -ఎస్‌ఎంవిఈ బెంగళూరు (12504), సికింద్రాబాద్-షాలిమార్ (12774), సికింద్రాబాద్- హావ్‌డా (12704) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ నెల 7 తేదీన షాలిమార్ -సికింద్రాబాద్ (22849) రైలు, 9వ తేదీన సికింద్రాబాద్- షాలిమార్ (22850) రైళ్ల సర్వీసులను అధికారులు రద్దు చేశారు. పలు రైళ్ల రద్దుతో పాటు మరికొన్ని రైళ్ల వేళలను తాత్కాలికంగా అధికారులు రీషెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరాల్సిన కన్యాకుమారి -దిబ్రూగఢ్ రైలు (22503)ను రాత్రి 10 గంటలకు రీషెడ్యూల్ చేశారు. ఈ రాత్రి 7.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలు (08583)ను 8.15 గంటలకు రీషెడ్యూల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News