Friday, December 20, 2024

సోమర్‌సెట్‌దే టి20 బ్లాస్ట్ టైటిల్..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లాండ్‌లో జరిగిన వైటాలిటీ టి20 బ్లాస్ట్ 2023లో సోమర్‌సెట్ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ బాల్‌తో చెలరేగడంతో సోమర్‌సెట్ 14 పరుగుల తేడాతో ఎసెక్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 20 ఓవర్లలో 145 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఎసెక్స్ జట్టు 18.3 ఓవర్లకే చాపచుట్టేసి 131 పరుగులే చేయగలిగింది.

దీంతో డిపెడింగ ఛాంపియన్ ఓటమి తప్పలేదు. ఇక ఈ టైటిల్‌తో సోమర్‌సెట్ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చివరిసారిగా 2005లో లీగ్‌ను గెలుచుకున్న సోమర్‌సెట్ ఇప్పుడు టైటిల్‌ను సాధించింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో సోమర్‌సెట్ తరపున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన మాట్ హెన్రీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ 7 వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News