Monday, April 7, 2025

సిఎం ముఖ్య సలహాదారుడిగా సోమేశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య సలహాదారుగా విశ్రాంత ఐఎఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యసలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో 3ఏళ్ల పాటు కొనసాగనున్నారు. తనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా నియమించినందుకు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుని సోమేష్‌కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాగా.. సోమేష్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన ఎపికి బదిలీ అయ్యారు. ఎపిలో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆయన విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News