Monday, December 23, 2024

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ సిఎస్ సోమేష్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : సీనియర్ ఐఎఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విఆర్‌ఎస్ కోరుతూ సోమేష్ కుమార్ చేసుకున్న దరఖాస్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమేష్ కుమార్ విఆర్‌ఎస్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటానని ఎపి ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్ధించడంతో ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్‌ను సోమేష్‌కు ఎపి ప్రభుత్వం ఇవ్వలేదు. వాస్తవానికి సోమేష్ కుమార్ సర్వీస్ ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉంది. అయితే విఆర్‌ఎస్‌ను అనుమతించాలని కోరుతూ సోమేష్ కుమార్ ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డికి దరఖాస్తు పంపారు. దీంతో ఎసి సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. తాజాగా సోమేష్ కుమార్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటనేది చర్చానీయంశంగా మారింది. తెలంగాణ సిఎం కెసిఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన సోమేష్ కుమార్ సేవలను ఏదో రకంగా వినియోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News