ముంబై: స్టాక్ మార్కెట్ లో సంచలన వ్యాఖ్యలు పోస్ట్ పెట్టే హిండెన్ బర్గ్ తాజాగా సంచలనాత్మక ట్వీట్ చేసింది. నేడు(ఆగస్టు 10న) ‘త్వరలో ఇండియాలో పెద్ద ఘటన జరుగనుంది’ అని రాసింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనేది షార్ట్-సెల్లింగ్ సంస్థ. ఓ బడా ఇండియన్ కంపెనీ హస్తం ఉండబోతున్నది అని సూచనప్రాయంగా తెలిపింది. ఇదివరలో ‘అదానీ గ్రూప్’ మీద కూడా వ్యాఖ్యానించి ఆ కంపెనీ షేర్లు గణనీయంగా పతనమయ్యేలా చేసింది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ నియమాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అదానీ కోర్టుకు లాగుతానని బెదిరించినప్పటికీ ఏమీ చేయలేదు. కాగా నాడు అదానీ గ్రూపుకు 100 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. అయితే హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలన్ని నిరాధారమైనవేనని అదానీ గ్రూప్ ఖండించింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే అదానీ-హిండెన్ బర్గ్ ఇష్యూ ను కోర్టు పర్యవేక్షణలో పరిశోధించాలంటూ దాఖలైన పిటిషన్ ను భారత సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అది కూడా సెబీ నివేదిక ఆధారంగా. దాంతో ఆ కథ అక్కడితో ఆగిపోయింది. కానీ ఇప్పుడు హిండెన్ బర్గ్ ఏ కంపెనీ గురించి సంచలన వ్యాఖ్య చేసిందో తెలియడంలేదు.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024