Monday, December 23, 2024

కేంద్ర ఆర్థిక విషయాల్లో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Kejriwal

 

న్యూఢిల్లీ: ‘‘కేంద్ర ఆర్థిక విషయాల్లో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది. ఆ కారణంగానే కేంద్రం ప్రజలకిచ్చే ఉచిత సదుపాయాలను వ్యతిరేకిస్తోంది’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్,  కేంద్ర పన్నులో వాటాలో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 29 శాతానికి తగ్గించేయడం, ఆహారపదార్థాలపై  జిఎస్టి విధించడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005(ఎంజిఎన్ఆర్జిఏ) నిధులలో 25 శాతం కోత విధించడం వంటివాటిని ఉదాహరించారు. డబ్బంతా ఎక్కడికి పోతోందన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్రం పెద్ద ఎత్తున పన్నుల రూపంలో ఆదాయం పొందుతోందని, అందులో పెట్రోల్, డీజిల్ ద్వారా సంవత్సరానికి రూ. 3.5 లక్షల కోట్లు పొందుతోందని అన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఉచిత విద్యా, ఆరోగ్య, తదితర సదుపాయాలను కల్పించడాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ‘‘హఠాత్తుగా ఏమి జరిగింది…సైనికులకు పింఛన్లు ఇవ్వడానికి కూడా నిధులు లేవని ఎందుకంటున్నారు? ఇదంతా చూస్తుంటే కేంద్రం ఆర్థిక విషయాలలో ఏదో తేడా కొడుతోంది’’ అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News