Monday, December 23, 2024

అంగారక బిలాల మధ్య మెరిసేదేంది?

- Advertisement -
- Advertisement -

Something unexpected on Mars Its shining

పట్టు వదలని నాసా రోవర్ దేవులాట
రెండు బిలాల మధ్య అంతుచిక్కని రహస్యం
మరో గ్రహంలో ప్రాణి ఉనికి సంకేతాలు?

వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై తళతళ మెరిసే ఓ శకలం వంటి వస్తువును కనుగొంది. అంగారక ఉపరితలంపై ఉన్న జజెరో కందక ప్రాంతంలో రెండు బిలాల మధ్య ఈ మెరిసే వస్తువు ఉంది. పేరుకు తగ్గట్లుగా పర్సెవరెన్స్ పట్టు వదలకుండా సాగిస్తోన్న అన్వేషణల క్రమంలో అనూహ్యంగా ఈ వస్తువు కన్పించింది. మార్స్‌పై అత్యంత పురాతన సూక్ష్మజీవుల ప్రాణులు ఉండి ఉంటాయని, భూ వాతావరణానికి ఇక్కడికి సారూప్యత ఉందనే కోణంలో ఇప్పుడు రోవర్ అన్వేషణ కొనసాగిస్తోంది. ఇక్కడ కన్పిస్తోన్న మెరిసే వస్తువు అంగారక సంబంధితం కాదని, దీనికి భూమికి సంబంధం ఉందని నాసా శాస్త్రజ్ఞులు అంచనావేశారు. ఉపరితలంపై రెండు పొరల మధ్య పూర్తిగా ఈ గ్రహానికి అపరిచితంగా కొత్తదిగా అన్పించేలా ఈ దైదీప్యమాన వస్తువు ఉందని గుర్తించారు. ఓ జెట్‌ప్యాక్ ముక్కలాగా ఉన్న ఈ వస్తువుకు అక్కడ ఉన్నాయని భావిస్తున్న ప్రాణికి ఏదైనా సంబంధం ఉందా? మార్స్‌పై ఉండే ఇతర వస్తువులకు దీనికి ఎటువంటి సారూప్యత లేదని నాసా నిర్థారించింది. అయితే ఇది ఏదైనా సంకేతాలువెలువరించే వస్తువా? ప్రాణాఅనేది నిర్థారించుకుంటే తరువాతి క్రమంలో అంగారకుడిపై కనీసం అత్యల్ప జీవి ఉనికి ఉండేందుకు వీలుందా? అనేది తెలుసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు.

ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు వాడే థర్మల్ పరికరంలో వాడే వస్తువును పోలి ఉండి ఇది మెరుస్తూ ఉందని తేల్చారు. ఈ శకలం ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి వచ్చి వాలిందా? లేక ఇక్కడ సంభవించిన భీకర గాలులతో జరిగిన పేలుడు ఫలితంగా ఏర్పడిందా? అనేది కనుగొంటున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. ఎస్‌యువి పరిణామంలో ఉండే ఈ రోవర్ 2021 ఎప్రిల్ నుంచి అంగారకుడిపై ఉంది. పరిశోధనలు సాగిస్తోంది. ఇటీవలే ఈ రోవర్ ద్వారా వెలువడ్డ ఫలితాలు వేరే గ్రహంపై ప్రత్యేకించి అంగారకుడిపై జీవకోటి ఉనికి రహస్యాల విషయంలో తొలి మైలురాళ్లుగా మారాయి. ఈ గ్రహంపై గాలులను వాటి దిశలను ఈ రోవర్ తన ప్రత్యేక సాధనాల ద్వారా పసికట్టింది. ప్రత్యేకించి అంగారక వాతావరణ సమీకరణల విశ్లేషణలు (మెడా) సెన్సార్ల సముదాయాన్ని వినియోగించుకుని పరిశోధనలు చేపట్టింది. అంగారకుడిపై దట్టమైన భారీ స్థాయి మబ్బులు, ఓ దశలో దాదాపు 4 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించుకుని ఉన్నవాటిని కనుగొన్నారు. ఇప్పుడు ఈ అసాధారణ వస్తువు అంగారకుడిపై కన్పించింది. మార్స్‌పై ఉన్న జజెరో బిలం సంతరించుకుని ఉన్న ప్రత్యేకతల దశలో దీనిని ఎంచుకుని ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో గాలులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వేగంగా కదులుతూ ఉండటాన్ని గమనించి ఈ ప్రాంతంలో రోవర్ తిష్టవేసుకుని పరిశోధనలు చేపట్టింది. ఈ పలు విశిష్టతల ప్రత్యేక స్థలాన్ని చాలారోజుల క్రితమే ఈ రోవర్ వెతికిపట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News