Saturday, December 21, 2024

వ్యవసాయ పరికరాల్లో రూ.200 కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టిడిపి నేత సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి బాధ్యతలు చేపట్టాకా అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. సోమవారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కోర్టు ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం సిఎం జగన్ చేసిన తప్పు అని దుయ్యబట్టారు. మంత్రిగా కాకాణి రైతుల కోసం ఒక్క జివొ తెచ్చారా? అని నిలదీశారు. వ్యవసాయ పరికరాల్లో రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. కాకాణిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: భూమన వర్గీయుల అరాచకం… ఫేస్‌బుక్ కామెంట్… కిడ్నాప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News