Tuesday, January 21, 2025

ద్వారక, సోమనాథ్ ఆలయాలు మూసివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం దాకా చేపల వేటను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా 76 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుపాను కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన దేవ్‌భూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయఆలను గురువారం మూసివేశారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలను శుక్రవారం దాకా నిలిపివేశారు. అయితే అత్యవసర సమయంలో ఎయిర్‌పోర్టును పని చేయించడానికి అవరమైన పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News