Monday, December 23, 2024

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అధిష్ఠానం ఎక్కడ పని చేయమంటే అక్కడే పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మధుకర్ భేటీ అయ్యారు. అనంతరం కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.

బిజెపిలో చేరిన తర్వాత నెల రోజులపాటు తాను అమెరికా వెళ్లినట్లు చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎపిలో జగన్ పాలనపై స్పందిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలోపేతం విషయమై కిరణ్‌కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి ఆయనకు వివరించామన్నారు. ఆయన మార్గ నిర్దేశనంలో పని చేస్తామని వీర్రాజు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News