Thursday, December 26, 2024

అన్నంలో పురుగుల మందు కలిపి… తల్లిదండ్రులను చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పురుగుల మందు భోజనంలో కలిపి తల్లిదండ్రులను కుమారుడు చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం అర్కాల్‌గుడ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిసిలహళ్లిలో నంజున్‌దప్పా(55), ఉమా(48) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మంజునాథ్ అనే కుమారుడు వితంతువు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇంట్లో తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకొని సదరు వితంతువుకు ఇచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం నిరాకరించడంతో పాటు ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తల్లిదండ్రులను చంపాలని మంజునాథ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆగస్టు 15న వారు తినే అన్నంలో పురుగుల మందు కలిపాడు.

Also Read: ఆసియా టోర్నీకి అఫ్గాన్ జట్టు ఎంపిక..

వారు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. పేగులలో పురుగుల మందు ఉండిపోవడంతో ఆగస్టు 23న తల్లిదండ్రులు చనిపోయారు. అకస్మాత్తుగా తల్లిదండ్రులు మృతి చెందడంతో మరో కుమారుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో వాళ్లు పురుగుల మందు సేవించి చనిపోయినట్టు తేలింది. వెంటనే పోలీసులు అనుమానంతో మంజునాథ్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పున్నామ నరకం నుంచి కుమారుడు రక్షిస్తాడనుకుంటే బతికుండగా తల్లిదండ్రులను కాటికి పంపాడని స్థానికులు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News