Thursday, January 23, 2025

పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: పెళ్లి చేయడంలేదని ఓ కుమారుడు తన తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం నార్నాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుదీప్ అనే యుక్త వయసు రావడంతో పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులను పలుమార్లు అడిగాడు. పెళ్లి చేయడం లేదని కుటుంబ సభ్యులతో సుదీప్ పలుమార్లు గొడవకు దిగాడు. కుమారుడి పెళ్లి విషయం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో వాళ్లు పొలం పనులు చేస్తుండగా సుదీప్ అక్కడికి వెళ్లాడు. పెళ్లి విషయం గురించి తల్లిదండ్రులతో కుమారుడు గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గొడ్డలితో వారిపై దాడి చేశాడు. చుట్టు పక్కల వారు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News