- Advertisement -
రంగారెడ్డి: కన్నతండ్రిపై కుమారుడు గొడ్డలితో దాడి చేసిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుమార్తెకు భూమిలో వాటా ఇచ్చాడని కోపంతో తండ్రి రెండు కాళ్లు నరికి కుమారుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తండ్రి వెంకటయ్యకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -