Thursday, February 13, 2025

ఆస్తి కోసం మరీ ఇంత బరితెగింపా..!?

- Advertisement -
- Advertisement -

సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. జనగామ జిల్లా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కుమారుడు నిలిపివేశాడు. మూడు రోజులుగా తండ్రి శవాన్ని ఇంటి ముందు ఉంచి ఆస్తి కోసం పట్టుపడుతున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏవడునూతల గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. వెలికట్టే యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు, రెండో భార్యకి ఒక కుమారుడు ఒక కూతురు అన్నారు. యాదగిరికి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా మొదటి భార్య కొడుకుకి ఐదు ఎకరాలు, రెండో భార్య కొడుకుకి ఐదు ఎకరాలు, కూతురికి ఐదు ఎకరాల ఆస్తి మూడు భాగాలుగా పంచాడు. కొద్ది రోజుల క్రితం యాదగిరి రెండో భార్య కుమారుడు చనిపోగా అతనికి భార్య, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అతని వాటా ఐదు ఎకరాల ఆస్తిని ఆమె కూతురు పేరు మీద రాసింది.

అయితే కూతురికి రాసిన ఐదెకరాల భూమిలో మూడు ఎకరాలు భూమిని అమ్ము కోగా రెండు ఎకరాలు మిగిలింది. తండ్రి యాదగిరి మూడు రోజుల క్రితం సోమవారం రోజు చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలను కుమారుడు నిర్వహిం చాలి. రెండవ భార్య కుమారుడు చని పోగా మొదటి భార్య కుమారుడు ఉన్నాడు. దీంతో రెండవ భార్య కూతురు పేరు మీద రాసిన ఐదు ఎకరా ల్లో మిగిలి ఉన్న రెండు ఎకరాలు భూమి తన పేరు మీదకు చేసే వరకు అంత్యక్రియలు జరగనివ్వనని కుమారుడు అడ్డుకున్నాడు. దీంతో అన్న ,చెల్లెల మధ్య ఆస్తి తగాదాతో మూడు రోజుల నుండి తండ్రి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇంటి ముందు తండ్రి శవం పెట్టుకొని కుమారుడు చెల్లి పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమి కోసం అన్న అడ్డు పడుతున్నాడు. గ్రామంలోని పెద్ద మనుషులు, బందువులు రాజీకి కుదిర్చిన వినకపోవడంతో మూడు రోజులు తండ్రి యాదగిరి దహన సంస్కారాలు నిలిచిపోయాయి. ముందు అంత్యక్రియలు నిర్వహిస్తే తర్వాత ఆస్తుల గురించి చూసుకుందామని చెబుతున్నా అతను వినడం లేదు. ఈ విషయం పోలీసులకూ వెళ్తే కానీ అతను స్పందించడని గ్రామస్తులు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News