Saturday, January 4, 2025

దారుణం.. 50సెంట్ల భూమికోసం కొడుకు కుటుంబాన్ని మసి చేశాడు..

- Advertisement -
- Advertisement -

 గాఢ నిద్రలో ఉండగా పెట్రోల్ పోసి నిప్పు, అంతకుముందే నీళ్ల ట్యాంకు ఖాళీ చేసిన తండ్రి
 కొడుకు కోడలు, మనవరాళ్లూ మృతి
 కేరళలో తెల్లవారుజామున దారుణం
ఇదుక్కి: కేరళలో ఓ వ్యక్తి తన కుమారుడిని, కోడలిని, ఇద్దరు మనవరాళ్లను దారుణంగా నిప్పంటించి హతమార్చాడు. పెద్ద వయస్కుడైన ఈ వ్యక్తి కొడుకుతో 50 సెంట్ల భూమి తగాదాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమారుడు నిద్రపోతుండగా ఒంటిపై పెట్రోలు పోసి తగులబెట్టాడని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఇదుక్కిలో ఈ దారుణం జరిగింది. ఇంట్లో అంతా నిద్రపోతున్న సమయం చూసుకుని ఈ తండ్రి కుమారుడు ఫైజల్‌ను కుటుంబంతో పాటు హతమార్చాడు. హమీద్ అనే ఈ 79 సంవత్సరాల పెద్ద మనిషి పెట్రోలును కిటికీ నుంచి ఇంటిలోకి పోసి నిప్పంటించాడు. కుమారుడి పక్కనే పిల్లలు భార్య నిద్రిస్తూ ఉన్నారు. వారు కూడా ఘటనలో బలి అయ్యారు. మంటలు అంటుకున్న వారు సాయం కోసం కేకలు పెట్టారు. దీనితో ఇరుగుపొరుగు అక్కడికి వచ్చినా లోపల మంటలు భీకరంగా తలెత్తడంతో ఏమీ చేయలేకపొయ్యారని వెల్లడైంది. ముందుగా అనుకున్న పథకం ప్రకారమే హమీద్ ఇంట్లో పెట్రోలు నిల్వచేసుకుని ఉంచుకున్నాడని తేలింది. మంటలు చెలరేగితే ఆర్పివేసేందుకు నీళ్లు అందుబాటులో ఉండకుండా నీటి ట్యాంక్ ఖాళీ చేశాడు. ఇంటిలోని బక్కెట్లు బయటపారేశాడు. కొడుకు తన కుటుంబంతో గాఢనిద్రలో ఉండగా హత్యాకాండకు దిగాడు. స్కూళ్లకు వెళ్లే పసిప్రాయంలో ఉన్న ఓ కూతురు తండ్రిని పొదివి పట్టుకుని ఉంది. పక్కన ఇంకో బిడ్డ, భార్య నిద్రిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఈ విచక్షణారహిత ముసలి వ్యక్తిజ్వాలలో మాడి మాసయ్యారు.
ఇల్లు కూడా తగలబడింది. తాను ఇంట్లోని ఉండి, అంతా నిద్రపోయ్యారని నిర్థారించుకున్న తరువాత వారిపై ఇంటిలోపల పెట్రోలు పోసి, తరువాత తలుపులకు తాళాలు వేసి మంటలు అంటించి ఈ వ్యక్తి పారిపోయినట్లు తరువాత ఈ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడైంది. ఘటన తరువాత లోపలికి వెళ్లి చూసిన వారికి అక్కడ హృదయవిదారక దృశ్యా లు కన్పించాయి. తగలబడిపోయిన కొడుకు తన కూతురిని గట్టిగా పొదివిపట్టుకుని ఉన్న దశలోనే మంటలకు ఆహుతి అయ్యాడు. ఈ ఇద్దరి శరీరాలను వేరు చేయడం దుర్లభం అయింది. అతి కష్టం మీద వీరిని బూడిద రూపంలో వేరు చేశారు. పట్టుబడ్డ హమీద్ తాను కుటుంబ ఆస్తి తగాదాల విషయంలోనే కొడుకుతో పడకపోవడంతో ఈ చర్యకు దిగానని, అందరిని కాల్చిచంపానని తెలిపాడు. తన నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Son family killed by father in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News