Sunday, December 22, 2024

తండ్రిని చంపిన కొడుకుకు జీవిత ఖైదీ

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ పరిధిలోని జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన కత్తెర్ల మహేష్ (21) అనే యువకుడు 2021 మే 7వ తేదీన రాత్రి సొంత తండ్రి కత్తర్ల లచ్చయ్య అనే వ్యక్తిని రోకలిబండతో కొట్టి చంపిన కేసులో నేరం రుజువైనందున జీవితఖైదీతో పాటు వేయి రూపాయల జరిమానాను విధిస్తూ పెద్దపల్లి స్టేషన్‌కోర్టు జడ్జి డి హేమంత్‌కుమార్ గురువారం తీర్పు చెప్పారని సుల్తానాబాద్ సీఐ కె జగదీష్ తెలిపారు. హత్యకు గురైన కత్తర్ల లచ్చయ్య సతీమణి కత్తెర్ల లలిత ఫిర్యాదురాలు వారి పెద్ద కొడుకు అయిన కత్తెర్ల మహేష్ నిందితుడు డిగ్రీ చదివి ఫెయిల్ అయి ఇంటి వద్ద ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా ఖాళీగా ఆవరగా తిరిగేవాడని కత్తెర్ల లచ్చయ్య 2021 మే 7వ తేదీన రాత్రి 8.30 గంటలకు మహేష్ బయటకు వెళ్లి ఇంటికి రాగానే తండ్రి లచ్చయ్య తిట్టగా చుట్టు పక్కల వారు, స్నేహితులు అందరు చూసేసరికి అవమానంగా ఫీల్ అయ్యి ఎలాగైనా తన తండ్రిని చంపాలని అనుకొని అదే రోజు తల్లి తమ్ముడు ఇంట్లో పడుకోగా ఆరుబయట మంచంపైన పడుకొని ఉన్న తండ్రి పక్కన మరో మంచంలో పడుకొని రాత్రి 10.30 గంటల సమయంలో తండ్రిని రోకలి బండతో తలపైనా బలంగా కొట్టగా అక్కడికి అక్కడే చనిపోయినాడు.

తన భర్తను చంపిన కొడుకు కత్తెర్ల మహేష్ పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా అప్పటి జూలపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో కేసు నమోదు చేసి అప్పటి సీఐ ఎ ఇంద్రసేనరెడ్డి పరిశోధన ప్రారంభించి విచారణ చేసి నేరస్తుని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారని సీఐ జగదీష్ తెలిపారు. తదుపరి పరిశోధన పూర్తిచేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపాల్ జిల్లా, సెషన్స్ జడ్జికోర్టు పెద్దపల్లి కోర్టులో కేసు విచారణ జరిగింది. పెద్దపల్లి స్టేషన్ కోర్టు జడ్జి డాక్టర్ డి హేమంత్‌కుమార్ జిల్లా సెషన్స్ జడ్జి ఇరువురి వాదనలు విని తదనంతరం నేరస్తుడు మహేష్ తన తండ్రిని హత్య చేసినట్లు నేరం రుజువు కావడం వల్ల అతనికి కఠిన కారాగార శిక్షతో పాటు జీవితఖైదు, 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ తెలిపారు. నేరస్తునికి శిక్ష పడడానికి ముఖ్యపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి జ్యోతిరెడ్డి సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్నిరుజువు చేయడంలో కీలకపాత్రపోషించారని సీఐ అన్నారు.

పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, పెద్దపల్లి ఏసీపీ ఎ మహేష్, పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశ పెట్టడానికి సహకరించిన జూలపల్లి ఎస్‌ఐ ఎ వెంకటకృష్ణ, సుల్తానాబాద్ సీఐ కె జగదీష్, సుల్తానాబాద్ కోర్టు కానిస్టేబుల్ పి శ్రీనివాస్, పీసీ ఎం సందీప్, ఆఫీసర్లు లైసన్ హెడ్ కానిస్టేబుల్ పి కోటేశ్వరరావులను రామగుండం పోలీస్ కమీషనర్ డీఐజీ రేమా రాజేశ్వరి, ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు తెలిపారని సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News