Saturday, November 23, 2024

అత్తింటివారిపై అల్లుడు కత్తితో దాడి.. మామ మృతి

- Advertisement -
- Advertisement -

Young Man injured after his friends attack in Hyd

అమరావతి: అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెంలో జరిగింది. ఈ ఘటనలో మామ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గన్నవరం మండలం బల్లి పర్రు గ్రామానికి చెందిన వీరబాబు(30), ధనలక్ష్మికి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అత్తింటివారు కట్నంగా ఇచ్చిన భూమిని అమ్మాలని వీరబాబు భార్యను బలవంతం చేస్తున్నాడు. భార్య మాత్రం భూమి అమ్మడానికి వీల్లేదని తెలిపింది. దీంతో అత్తింటివారితో అల్లుడు పలుమార్లు గొడవలు జరిగాయి. వెదురుబీడెం గ్రామంలో అత్తింటి వారు నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామును వారిపై వీరబాబు కత్తితో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భార్య, అత్తమామల పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మామ కొండల్‌రావు చనిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News