Friday, February 21, 2025

భార్య, అత్తమామపై దాడి చేసిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

భార్య, అత్తమామపై అల్లుడు దాడి చేసిన సంఘటన వరంగల్ నగరంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రత్న హోటల్ ఎదురుగా భారతి డిగ్రీ కళాశాల లైన్‌లో జన్నుబాబు ఫ్యామిలీ నివాసం ఉంటుంది. జన్ను బాబు కుమార్తె పల్లవి ఉర్సు ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజులపాటు బాగానే కలిసి ఉన్నారని గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఏడాది నుంచి దూరంగా ఉంటున్న అల్లుడు చంద్రశేఖర్ గురువారం సాయంత్రం ఇంటికి వచ్చి భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందుగా భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అనంతరం అడ్డువచ్చిన అత్తమామలపై కత్తితో దాడిచేసి గాయపర్చినట్లు బాధితులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భార్య పల్లవి, మామ బాబు పరిస్థితి విషంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News