Sunday, January 19, 2025

అత్తింట్లో అల్లుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Son-in-law committed suicide in Attagarint

హత్యేనంటున్న గ్రామస్థులు

బంట్వారం: అత్తింట్లో అల్లుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళితే మాలసోమారం గ్రామానికి చెందిన సాయిబాబా (28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. సాయిబాబాకు గత ఐదు సంవత్సరాల క్రితం బంట్వారం గ్రామానికి చెందిన గోవిందమ్మతో వివాహం జరిగింది. అయితే భార్య పుట్టింటికి రావడంతో ఆమెను తీసుకురావడానికి సాయి బాబా మంగళవారం తన అత్తగారింటికి వెళ్ళాడు. ఆ సమయ ంలో సాయిబాబా మద్యం సేవించి ఉండడంతో కుటుంబ సభ్యు లు ఈ సమయంలో వద్దు రేపు తీసుకువెళ్లని చెప్పగా సా యి బాబా నేరుగా తన సొంత గ్రామానికి తిరిగివచ్చి తన భార్య గోవిందమ్మ చిన్నమ్మ అమ్రాది లక్ష్మి ఇంటికి వెళ్ళాడు.

అయితే రాత్రి ఎవరూ లేని సమయంలో అమ్రాది లక్ష్మిఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకున్నాడని లక్ష్మి గ్రామస్థులకు చెప్పడంతో వారు వెంటనే వారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు సాయి బాబా మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన చి న్నమ్మ అమ్రాది లక్ష్మి హతమార్చిందంటూ గ్రామంలో పుకార్లు వినిపిస్తున్నాయి. మృతుడి తల్లి సంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆనంద్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News