కన్నెపల్లి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం కోసం ఓ యువకుడు స్నేహితుడితో కలిసి అత్తమామలపై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి… మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామానికి చెందిన గోలేటి శంకర్ లక్ష్మిలపై అల్లుడు గోమసా నరేందర్ మంగళవారం రాత్రి పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో అత్తమామలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కొద్ది నెలలుగా ఆస్తి కోసం అత్త మామ, అల్లుడి మద్య గొడవలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో గోమాస నరేంద్ర తన భార్యను కొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించారు. అంతటితో ఆగకుండా ఆస్తి కోసం గొడవ చేయడానికి కరీంనగర్ నుంచి గోమాస్ నరేందర్ తన స్నేహితుడు మహేష్‌తో అత్తింటికి వచ్చాడు. అదనపు కట్నం కోసం అత్తమామలతో గొడవకు దిగారు. ఏదో అఘాయిత్యానికి ఒడికట్టడానికి వచ్చాడని గ్రహించిన అత్తమామలు ఇంటి వెనుక తలుపులు వేసి అక్కడ నుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టోల్‌తో నేలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడ నుంచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనలో రెండు బులెట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సందర్శించారు.
నిందితుడికి తుపాకీ ఎక్కడిది…?
ఆస్తి కోసం అత్తమామలపై కాల్పులు జరిపిన నిందితుడు నరేందర్‌కు తుపాకీ ఎక్కడదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లో నివాసం ఉంటున్న గోమాత నరేందర్ అత్తమామలతో కొంత కాలంగా అదనపు కట్నం కోసం గోడవ చేస్తున్నాడు. ఇదే అక్రమంలో రూ. 10 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను కొట్టి కన్నెపల్లికి పంపించాడు. తుపాకీతో బెధిరించి డబ్బులు గుంజాలనే ఉద్దేశమా లేక హత్య చేయాలనే పథకం ప్రకారం వచ్చాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా అదనపు కట్నం కోసం అత్తమామలను హత్య చేయడానికి నిందితుడు తుపాకీని వినియోగించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. అదనపు కట్నం కోసం అత్తమామలపై అల్లుడు తుపాకీ కాల్పులకు దిగడం సంచలనంగా మారింది. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.