Friday, November 22, 2024

పని చేసుకోమని చెప్పిన అత్తను హత్య చేసిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

 

కష్టపడి పని చేసుకోమని చెప్పినందుకు ఓ అల్లుడు అత్తను హత్యమార్చిన ఘటన మెదక్ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం ఫైజాబాద్‌లో చోటుచేసుకుంది. ఫైజాబాద్‌కు చెందిన అంతిరెడ్డిగారి బుచ్చిరెడ్డికి సరితతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో అత్తగారు ఇచ్చిన బంగారంలో కొంత బుచ్చిరెడ్డి 8 ఏళ్ల కిందట అమ్మేశాడు. దీనిపై గొడవలు జరిగాయి దింతో సరిత పుట్టింటికి వచ్చేసి అక్కడే ఉన్నారు. ఆరు నెలల కిందట పెద్దలు సర్దిచెప్పడంతో సరిత తన భర్త వద్దకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే మిగిలిన బంగారం కూడా అమ్మేస్తానంటూ బుచ్చిరెడ్డి భార్యపై ఒత్తిడి చేయడంతో తిరిగి సంక్రాంతి పండగకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆదివారం ఫైజాబాద్‌కు తల్లి అనసూజతో సహా వచ్చింది. ఆ రోజు రాత్రి నిద్రించే ముందు బంగారం ఎందుకు అమ్ముతావని బంగారం అమ్మకుండా ఏదైనా కష్టపడి పని చేసుకోమని హితవు పలికింది. దీంతో కోపోద్రిక్తుడైన బుచ్చిరెడ్డి అత్త అనుసూజను మరో గదిలోకి లాక్కెళ్లి రాడ్డుతో తలపై గట్టిగా కొట్టగా తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరింది.
వెంటనే బుచ్చిరెడ్డి అనసూజను నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడి చరవాణి సిగ్నళ్ల ద్వారా నర్సాపూర్‌లో ఉన్నాడని తెలియడంతో అక్కడికి వెళ్లి బుచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నర్సాపూర్‌ సిఐ , పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వృద్ధురాలి కుమారుడు రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News