Monday, December 23, 2024

పొలం పని చేయమన్నందుకు మామను చంపిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

మక్తల్: పొలంలో పని చేయమన్నందుకు మామపై ఇల్లరికపు అల్లుడు కర్రతో దాడి చేసి చంపిన సంఘటన మహమూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పస్పుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డన్నోళ్ల లక్ష్మప్ప (44)కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రేణుకను జడ్చర్ల మండలం ఆలూరుకు చెందిన గోపి మల్లేష్ (30)తో వివాహం జరిపించి, ఇల్లరికం చేసుకున్నారు. అయితే మద్యానికి బానిసలైన మామ లక్ష్మప్ప, అల్లుడు గోపి మల్లేష్‌లు మద్యం మత్తులో తరచూ పొలం పనుల విషయమై గొడవ పడుతుండేవారు.

ఈ క్రమంలోనే ఈనెల 14న రాత్రి పొలం వద్ద ఇద్దరి మధ్య ఘ ర్షణ జరగ్గా, పక్కన ఉన్న కర్ర తీసుకున్న గోపి మల్లేష్ మామ లక్ష్మప్పను విచక్షణారహితంగా కొట్టడంతో లక్ష్మప్పకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు చికిత్సకై మక్తల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే లక్ష్మప్ప మృతి చెందాడు. ఈ విషయమై లక్ష్మప్ప బంధువు బొడ్డన్నోళ్ల నర్సిములు ఫిర్యాదు మేరకు గోపి మల్లేష్‌పై కేసు నమోదు చేశామని మక్తల్ ఎస్సై పర్వతాలు సిఐ కె. రాంలాల్‌లు తెలిపారు. లక్ష్మప్ప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News