Wednesday, January 22, 2025

అత్తను కాల్చి చంపిన పోలీస్ అల్లుడు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: ఆర్థిక లావాదేవీల కారణంగా అత్తను అల్లుడు గన్‌తో కాల్చి చంపిన సంఘటన హనుమకొండ జిల్లా సింగారంలోని ఇంద్రాకాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్ జిల్లా కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రసాద్ ఆయన భార్య రమాదేవికి గత నాలుగు సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ లో రమాదేవి ఫిర్యాదు చేయగా వారి కుటుంబ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.15 వేల ఇస్తానని ప్రసాద్ చెప్పాడు. ఇటీవల ప్రసాద్ బామ్మర్ది దేవేందర్‌తో గొడవ జరిగింది. బామ్మర్ది ప్రసాద్, అత్త కమల్మ (53)ను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇదే క్రమంలో అదే పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ తుపాకీని తీసుకొని గురువారం ఉదయం గుండ్ల సింగారం చేరుకున్న ప్రసాద్ కమలమ్మతో కొద్దిసేపు బాగానే మాట్లాడాడు. అయితే ప్రసాద్ కమలమ్మ గతంలో రూ. 4 లక్షల ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి అడగడంతో వారు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తను తన వెంట తెచ్చుకున్న గన్‌తో కాల్చి చంపాడు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కాల్పులు జరిపి అక్కడే నిలబడి ఉన్న ప్రసాద్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేయడంతో ప్రసాద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ బారితో కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, సిఐలు అబ్బయ్య, తుమ్మ గోపి, కరుణాకర్, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News