Wednesday, January 22, 2025

కుటుంబ సభ్యులపై ఇంటల్లుడి దాడి

- Advertisement -
- Advertisement -
Son in law Knife attack on family members in Mulugu
వృద్ధురాలి మృతి.. భార్య, అత్తమామల పరిస్థితి విషమం

ములుగు : వెంకటాపురం మండలం కొండాపురంలో పండుగ పూట దారుణం జరిగింది. భార్య, అత్తమామలు, భార్య అమ్మమ్మపై ఆ ఇంటి అల్లుడు కత్తితో దాడి చేసి ఒక వృద్ధురాలిని హత్య చేశాడు. కాగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సం బంధించి స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. దుర్గం చంటి అనే వ్యక్తి కుటుంబ కలహాలతో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. దాడిలో చంటి భార్య అమ్మమ్మ ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, అడ్డువచ్చిన వారిపై సైతం చంటి కత్తితో దాడి చేయడంతో అత్తా, మామ, భార్య లోకేశ్వరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో బంధువులు వారిని ఆస్పత్రికి రలించారు. దాడికి కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News