Saturday, December 21, 2024

పసివాడి ప్రాణం తీసిన అక్రమ సంబంధం

- Advertisement -
- Advertisement -

తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో సొంత తల్లి పసివాడి ప్రాణం తీసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ అదే గ్రామానికి చెందిన వ్యక్తితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని బుధవారం అర్ధరాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో కుమారుడు హరికృష్ణ (11) తలపై కట్టెతో కొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో కుమారుడిని వేసి, నీటిలో పడి చనిపోయినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, బాలుడి తలపై రక్తపు గాయాలు ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేసిన పోలీసులు తల్లి కట్టెతో కొట్టడం వలనే కుమారుడు మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News